Fire Accident near Thousand Pillar Temple : వేయిస్తంభాల గుడి సమీపంలో అగ్నిప్రమాదం - Fire Accident near Thousand Pillar Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2023, 11:45 AM IST

Fire Accident near Thousand Pillar Temple : హనుమకొండ పట్టణంలోని ఓ కిడ్నీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. వేయిస్తంభాల గుడి ఎదురుగా ఉన్న శ్రీనివాస కిడ్నీ ఆసుపత్రిలో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రిలో షాట్​ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్‌లతో అక్కడికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రోగులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది రోగులు ఉన్నారని అగ్నిమాపక అధికారి నాగరాజు తెలిపారు. రోగులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చామని, చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది కానీ.. ఆసుపత్రిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. రోగులంతా సురక్షితంగా బయటపడడంతో ఆసుపత్రి యాజమాన్యం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.