Fire Accident in Rice Mill : రైస్‌మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం బస్తాలు - మహబూబాబాద్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Fire Accident in Rice Mill Mahabubabad : రాష్ట్రంలో రోజురోజుకూ అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల అధిక సంఖ్యలో నష్టం వాటిల్లుతోంది. వేసవి కావడంతో ఈ ప్రమాదాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని మహాదేవ్ రైస్ మిల్ ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రైస్ మిల్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులోని చాలా ధాన్యం అగ్నికీలలకు ఆహుతైంది. హమాలీలు అప్రమత్తంగా వ్యవహరించి ఆరు బయట, పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు మంటలు అంటుకోకుండా అక్కడి నుంచి తరలించారు. ఘటనలో భారీ నష్టం వాటిల్లినట్లు రైస్‌మిల్ యజమాని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయా లేదా ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.