Fire Accident Nizamabad : మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటనలో అపశ్రుతి .. తప్పిన ప్రమాదం - మంత్రి ప్రశాంత్‌రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Fire Accident At Telangana decade celebrations in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరైన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వేడుకలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. అక్కడున్న వారి అప్రమత్తతో ప్రమాదం తప్పింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. భీంగల్ మండలం పురానీపేట గ్రామంలో చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చెరువు వద్ద వేడుకల కోసం అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానులు టపాకాయలు పేల్చారు. దీంతో అవి అదుపుతప్పి.. పక్కనే ఉన్న టెంట్‌కు అంటుకున్నాయి. ఈ క్రమంలోనే మంటలు చెలరేగి.. పెద్దఎత్తున వ్యాపించాయి. వంట కోసం ఏర్పాట్లు చేస్తున్న చోట మంటలు అంటుకుని.. అక్కడ వేసిన టెంట్ పూర్తిగా దగ్ధమైంది. అక్కడున్న వారంతా పరుగులు తీయటంతో ప్రమాదం తప్పింది. స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఉన్నట్టుండి మంటలు చేలరేగడంతో వేడుకల్లోని ప్రజలు భయాందోళను గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ హాని జరగకపోవడంతో పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.