టిప్పర్ ఇంజిన్‌లో మంటలు - పెట్రోల్‌బంకులో తప్పిన పెను ప్రమాదం - పెట్రోల్‌బంకులో అగ్ని
🎬 Watch Now: Feature Video
Published : Jan 4, 2024, 7:42 PM IST
Fire Accident at Petrol Bunk : పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకోవడానికి వచ్చిన లారీ ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన మంటలు ఆర్పేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పినందుకు బంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Lorry Fires at Bunk in Karimnagar : వివరాల్లోకెళ్తే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారంలోని పెట్రోల్ బంకుకి డీజిల్ ఫిల్ చేసుకోవడానికి టిప్పర్ వచ్చింది. డీజిల్ నింపడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇంతలోనే టిప్పర్ ఇంజిన్ నుంచి పొగలు రావడం ప్రారంభమై మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు టిప్పర్ ఇంజిన్‌కు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. బంకులో ఉన్న ఫైర్ డిష్టింగ్యుషర్, పెద్దఎత్తున నీటిని చల్లి మంటలను ఆర్పివేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని బంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చల్లార్చడంతో ఏమాత్రం ఆశ్రద్ధ వహించిన భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించేదన్నారు.