బాణాసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం-తప్పిన ప్రాణనష్టం - వనపర్తి జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 12, 2023, 7:24 PM IST
Fire Accident at Crackers Shop in Wanaparthy District : బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరిగిన.. మతాబు సామాన్యు అన్ని పూర్తిగా కాలిపోయిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొత్తకోట పట్టణంలో బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆకస్మికంగా పటాకుల షాపులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు దుకాణంలో ఉన్న వారిని బయటకు పంపించి.. మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
Diwali Celebrations in Telangana 2023 : అగ్నిప్రమాదం జరిగిన దుకాణాలకు సమీపంలో ఉన్న మరో 7 దుకాణాల్లో ఉన్న స్టాక్‌కు నిప్పు అంటుకోకుండా.. నిర్వాహకులు నీళ్లు చల్లడంతో పెను ప్రమాదమే తప్పింది. బాణసంచా దుకాణ నిర్వహిస్తున్న యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వహకులు తెలిపారు.