Film Producer Suresh Babu on Chandrababu Arrest చంద్రబాబు కూడా చిత్ర పరిశ్రమకు చాలానే చేశారు..! అయితే.. : సినీ నిర్మాత సురేష్ - Film Producer Suresh Babu news
🎬 Watch Now: Feature Video
Published : Sep 19, 2023, 7:34 PM IST
Film Producer Suresh Babu on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఏ రాజకీయ నాయకులకు గానీ, ఏ రాజకీయ పార్టీలకు గానీ సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ అనేది ఓ సున్నితమైన విషయమని పేర్కొన్నారు.
Suresh Babu Comments: హైదరాబాద్‌లో మంగళవారం నాడు నిర్వహించిన ఓ సినిమా ప్రమోషన్లో దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు.'' సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. సినిమాకు వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేదు. నా తండ్రి రామానాయుడు, నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలుగా పనిచేశాము. అది మా పర్సనల్ విషయం. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ఏ రాజకీయ నాయకులకో, ఏ రాజకీయ పార్టీలకో సంబంధం లేదు. చిత్ర పరిశ్రమ రాజకీయ, మతపరమైన అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేయదు. అందుకే, చంద్రబాబు అరెస్టుపై కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి చాలామంది ముఖ్యమంత్రులు దోహదపడ్డారు. అందులో చెన్నారెడ్డి చాలా సహాయం చేశారు. ఆ తర్వత ఎన్టీఆర్ చేశారు. చంద్రబాబు కూడా చిత్ర పరిశ్రమకు చాలానే చేశారు. అలాగని, చిత్ర పరిశ్రమ స్పందించడం లేదని కామెంట్ చేయడం సరికాదు. ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా చిత్ర పరిశ్రమ స్పందించలేదు.'' అని సురేష్ బాబు గుర్తు చేశారు.