Actress Jayasudha joined BJP : బీజేపీ గూటికి నటి జయసుధ.. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీకి ఛాన్స్ - BJP latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/640-480-19163555-841-19163555-1690978830002.jpg)
Movie Actress Jayasudha Joins BJP : ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్.. జయసుధకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జయసుధ మాట్లాడారు. ప్రధాని చేసిన అభివృద్ధి చూసి బీజేపీలో చేరినట్లు వివరించారు. ఏడాదిగా కమలం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని.. ఇవాళ పార్టీలో అధికారికంగా చేరినట్లు వివరించారు. మరోవైపు ఆమె.. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా.. అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తరువాత కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ గూటికి చేరారు. గతంలో ఆమె కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందిన విషయం తెలిసిందే.