భూవివాదంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు అన్నదమ్ముల పరస్పర దాడులు - Medak Registration Office
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 12:53 PM IST
Fight between brothers in Medak Registration Office : ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చి కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య, లింగయ్య, రాములు ముగ్గురు అన్నదమ్ములు. వారికి చెందిన ఎకరం భూమి లింగయ్య పేరు మీద ఉంది. అప్పటి నుంచి భూమిని ఎవరూ పంచుకోలేదు. దీంతో కుటుంబం పెరిగి వారి కొడుకులు, మనువళ్ల స్థాయికి చేరింది.
Argument in Land Issue : కాగా గత వారం రోజులుగా ఎకరం భూమి అందరికీ సమానంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. దీనిపై లింగయ్య మనుమళ్లు నిరాకరించడంతో గ్రామంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించారు. పంచాయితీ గ్రామ పెద్దలు నచ్చజెప్పి నర్సాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు పంపించారు. భూమి అగ్రిమెంట్ చేయించుకునే తరుణంలో మాటామాట పెరగడంతో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.