Father Sold His 4 Years Child : కన్న కుమారుడిని అమ్మేసిన తండ్రి - 4 ఏళ్ల బాబుని అమ్మేసిన తండ్రి
🎬 Watch Now: Feature Video
Father Sold His 4 Years Child : తండ్రి సొంత కుమారుడిని అమ్మిన ఘటన వరంగల్ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీమాబాద్‌కు చెందిన మసూద్ తన 4 ఏళ్ల బాబుని పోచమ్మ మైదాన్ ప్రాంతంలో బయట వ్యక్తులకు విక్రయించాడు. కుమారుడు ఎక్కడ అని మసూద్‌ను భార్య నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. బాబు తల్లి తన సోదరునితో కలిసి మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మసూద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని పోలీస్ కమిషనర్ రంగనాథ్ మట్టెవాడ పోలీసులను ఆదేశించారు.
'ఏ కేసు కూడా అక్కడితో వదిలిపెట్టేది ఉండదు. దీని గురించి ముందే అందరికీ స్పష్టంగా చెబుతున్నాను. విషయంపై లోతుగా పోతాం.. వెళ్లాక దాని వెనక ఉన్న రాకెట్ గురించి ఆరా తీస్తాం. కావాలని చేస్తున్నారా? అనేది ఆలోచించి చూస్తాం. కావాలని చేస్తే.. దీనికి సంబంధించి పాత్రధారులు ఎవరు అనేది బయటకు తీస్తాం. దీనిలో ఎవరు లాభపడుతున్నారో చూసి వారిపై లీగల్‌గానే చర్యలు తీసుకుంటాం'. -రంగనాథ్, వరంగల్ సీపీ