Farmers Protest in Secretariat : సచివాలయం ఆరో అంతస్తు నుంచి దూకిన రైతులు
🎬 Watch Now: Feature Video
Farmers Protest in Secretariat Maharashtra Today : మహారాష్ట్ర సెక్రటేరియెట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకారు రైతులు. మొదటి అంతస్తులోని రక్షణ వలయంలోకి దూకి.. తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. వీరంతా 'అప్పర్ వార్ధా ఆనకట్ట' కోసం భూమిని కోల్పోయిన రైతులేనని అధికారులు తెలిపారు. ఎక్కువ నష్ట పరిహారం, నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ మీద ప్రభుత్వ దృష్టి పడాలనే ఇలా చేసినట్లు రైతులు వివరించారు.
నినాదాలు చేస్తూ, ప్లకార్డ్‌లు ప్రదర్శిస్తూ.. రక్షణ వలయంలో రైతులు నడవడం వీడియోలో మనం చూడొచ్చు. ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. నిరసనను అడ్డుకుని 20 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. "అమరావతి జిల్లాలోని మోర్షి వద్ద 'అప్పట్ వార్ధా ఆనకట్ట' ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ పాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆందోళనకు దిగారు." అని ఓ అధికారి తెలిపారు. కాగా మహారాష్ట్ర సెక్రటేరియెట్ అయిన మంత్రాలయ భవనంలో.. ఆత్మహత్యలను నిరోధించడానికి కొంత కాలం క్రితం మొదటి అంతస్తులో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.