చెత్తతో కారు తయారు చేసిన రైతు- ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు జర్నీ
🎬 Watch Now: Feature Video
Farmer Made Electric Car : ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రోహిదాస్ నవుగునే. వ్యవసాయం చేస్తుంటాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని బ్రాహ్మణ వాడీ అనే చిన్న గ్రామం ఇతనిది. పదో తరగతి వరకే చదివాడు. రోహిదాస్ ఓసారి దిల్లీ వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ రిక్షాలను చూశాడు. అక్కడే తాను కూడా ఏదైనా వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నాడు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపుతో ప్రేరణ పొందాడు. మూడు నెలలు పాటు శ్రమించి లోహపు వ్యర్థాలతో 1930 నాటి మోడల్‌లో విద్యుత్ కారును తయారు చేశాడు.
ప్రస్తుతానికి ఇద్దరు కూర్చోవడానికే వీలుగా ఉండే ఈ కారు పూర్తిగా విద్యుత్ ఆధారంగా నడుస్తోంది. అందుకు కారుకు ఐదు బ్యాటరీలను అమర్చాడు. ఒక్కసారి ఈ కారుకు ఛార్జింగ్ పెడితే.. వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని రోహిదాస్ చెబుతున్నాడు. ఈ కారు తయారీ మొత్తం 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యిందని తెలిపాడు. భవిష్యత్‌లో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే నలుగురికి సరిపోయే కారును తయారు చేస్తానని రోహిదాస్ అన్నాడు.