'ఎన్నితీర్లు నష్టపోతిరా.. ఆదుకునే దిక్కులేదురా'.. గుండెల్ని మెలిపెడుతున్న రైతు పాట - crop loss due to rain in Bhadradri
🎬 Watch Now: Feature Video
Bhadradri Farmer song about crop loss : 'ఎన్ని తీర్లు నష్టపోతిరా.. రైతును ఆదుకునే దిక్కులేదురా.. పొమ్మన్నా పోదురా వానరా.. చెలరేగిన తుపానురా.. రాక రాక వచ్చిన వానరా.. రైతు గుండెల్లో తన్నెల్లి పోయేరా', 'ఆశలు చెడగొట్టి పోయేరా గాలులు' అంటూ అకాల వర్షానికి నష్టపోయిన తన పంటని చూపిస్తూ మొక్కజొన్న చేనులో ఓ రైతు పాడిన పాట గుండెల్ని మెలిపెడుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలవ్వడం చూసి ఆ రైతు పెట్టిన కన్నీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది.
crop loss due to rain in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి పాట రూపంలో ఆవేదనను వ్యక్తం చేశారు. సహజంగా గ్రామాల్లో పాటలతో అందరినీ ఆకట్టుకునే రామ్మూర్తి.. అకాల వర్షంతో తనకు వచ్చిన పంట నష్టంలోనూ తన గోడును పాట రూపంలో వెల్లబోసుకున్నారు. ప్రకృతి కూడా తమను చిన్నచూపు చూస్తే ఎలా బతకాలి అని ఆవేదనతో రామ్మూర్తి పాడిన పాట ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.