Fans fight for Virupaksha Movie: విరూపాక్ష సినిమా టైంకి స్టార్ట్ చేయలేదని థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18330403-122-18330403-1682311864619.jpg)
Fans attack on theater for Virupaksha Movie in Hyderabad: టికెట్ కొని సినిమా వెళ్లిన ప్రేక్షకులకు సరైమ సమయానికి షో వేయకపోవడంతో ఆగ్రహనికి గురైన ప్రేక్షకులు అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్ అంత ధ్వంసం చేసిన ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి చోటుచేసుకుంది. హైదరాబాద్లోని మూసాయిపేటలో లక్ష్మీకళ థియేటర్లో హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ప్రదర్శిస్తున్నారు. టికెట్ తీసుకొని ప్రేక్షకులు సినిమా హాల్లో కూర్చున్నారు. సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కావాల్సింది ఉండగా ఏడున్నర గంటలు అవుతున్నా తెరపై సినిమా ప్రదర్శించలేదు. దీంతో గంటన్నర సేపు ఆగిన ప్రేక్షకులు ఒక్క సారిగ ఆగ్రహానికి గురయ్యారు. కోపంలో థియేటర్లోని అద్దాలు, ఫర్నీచర్, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రేక్షకులను అదుపు చేశారు. ఇరు మధ్య గొడవను పరిష్కరించారు. ఈ ఘటనపై స్పందించిన యాజమాన్యం వెంటనే టికెట్ కొనుగోలు చేసిన వారందరికి తిరిగి డబ్బులు చెల్లించింది.