శంషాబాద్‌లో గుప్తనిధుల కలకలం - అనుమానాస్పద వస్తువు లభ్యం!
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 7:34 PM IST
Excavation for Hidden Treasures in Thondapally : గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా తొండపల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోని ఫామ్‌హౌస్ సమీపంలో లంకె బిందెల కోసం తవ్వకాలు జరిపారు. భూమి లోపలికి దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి పూజలు చేశారు. సదరు తవ్వకాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Hidden Treasures in Shamshabad : స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తవ్వకాలు జరిపిన సొరంగాల్లోకి వెళ్లి పరిశీలించారు. పోలీసులకు సదరు ప్రాంతంలో అనుమానాస్పద వస్తువు లభించింది. సంఘటన స్థలానికి కొద్ది దూరంలో మరో సొరంగం తవ్వి అందులో ఏదో వేసి దానిపై మట్టితో పూడ్చిన అనంతరం అగరవత్తులతో పూజలు నిర్వహించారు. గుప్తనిధుల కోసం తవ్విన ప్రాంతాల్లో నిధులు దొరికినట్లుగా గ్రామంలో వదంతులు వినిపిస్తున్నాయి. నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు.