Clash in Illandu Municipal Office : 'ఏయ్.. నువ్వు ఆఫీసర్‌వా'.. మున్సిపల్ అధికారిపై మాజీ కౌన్సిలర్ వాగ్వాదం - Clash in Illandu Municipal Office
🎬 Watch Now: Feature Video
Clash in Ex Councillor and Illandu Municipal Sanitary Inspector : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై మాజీ కౌన్సిలర్ దురుసుగా ప్రవర్తించారు. మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చిన మాజీ కౌన్సిలర్ వాసు.. ఆఫీసులో విధులు నిర్వహిస్తోన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్టపై పరుష పదజాలంతో దురుసుగా ప్రవర్తించారు. తీవ్ర కోపోద్రిక్తులైన వాసును అక్కడున్న మిగతా కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది వారించి బయటకు పంపించారు. దీనిపై స్పందించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్.. కంటతడి పెట్టుకుంటూ ఇరువురి మధ్య జరుగుతున్న ఘర్షణను వివరించారు. గత సంవత్సరం నుంచి ట్రేడ్ లైసెన్సుల విధానం ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోందని.. మాజీ కౌన్సిలర్ తన వద్దకు వచ్చి 2020 సంవత్సరం నుంచి 2023 వరకు ట్రేడ్ లైసెన్సులకు సంబంధించిన మ్యానువల్ రసీదులు కావాలని కోరినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కూడా పరిశీలన చేయమని చెప్పారని.. దీనిపై సందేహాలు ఉండటంతో తాను అకౌంట్ సెక్షన్ జేడీ ఇచ్చిన సూచనలతో గతంలో పనిచేసిన జవాన్ల నుంచి వివరాలు తెలుసుకుంటానని మాజీ కౌన్సిలర్‌కు చెప్పినట్లు వివరించారు. దీనిపై ఆగ్రహించిన వాసు అసభ్య పదజాలంతో దూషించారని కంటతడి పెట్టుకున్నారు.