Pratidwani అదిగో ఆర్‌ఆర్‌ఆర్ మణిహారం - ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17141208-207-17141208-1670422966243.jpg)
Pratidwani భాగ్యనగరం సిగలో మరో మణిహారం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డుకు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు దక్షిణ భాగం రహదారి ప్రణాళిక కొలిక్కి వచ్చింది. 189.23 కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మించాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి అధ్యయనంలో నిర్ధారించినట్లు సమాచారం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దూరంతో పోలిస్తే 7.37 కిలోమీటర్లు పెరిగింది. తొలుత నత్తనడకన సాగినా... కొంతకాలంగా చకచకా సాగుతున్న ఈ ప్రాజెక్టుతో... హైదరాబాద్ మహానగరం, రాష్ట్రానికి కలగనున్న ప్రయోజనాలు ఏమిటి? ఈ క్రమంలో ఏ ఏ సవాళ్లను అధిగమించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST