Pratidwani : పీఆర్సీ ఏర్పాటు... ఉద్యోగుల డిమాండ్లు - prc in telangana state
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 3, 2023, 10:14 PM IST
Pratidwani : శాసనసభ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కోసం కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 5 శాతం మధ్యంతర భృతిని కూడా ప్రకటించింది. ఆర్థిక అంశాలు ప్రత్యేకించి ఉద్యోగుల అంశాలపై సంపూర్ణ అవగాహన ఉన్న శివశంకర్‌ను కమిషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ నెల నుంచి ఇవ్వనున్న ఐఆర్‌తో ఖజానాపై ఏడాదికి 2 వేల కోట్ల వరకు భారం పడనుంది. 'పే రివిజన్ కమిటీ' నియమించాలన్న సీఎం ఆదేశాల పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండు సార్లు పీఆర్‌సీని ప్రభుత్వం అమలు చేసింది. శివశంకర్ కమిటీ నివేదిక ఇవ్వడానికి 2024 మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అంటే 2024 జూన్‌లోనే పీఆర్‌సీ సిఫార్సుల అమలుకు అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల ఆరోగ్య పథకం, సీపీఎస్ రద్దు, డీఏల మాట ఏమిటి?, పెండింగ్ సమస్యల మాటేమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపై నిపుణుల అభిప్రాయాలతో నేటి ప్రతిధ్వని ఇప్పుడు చూద్దాం.