Pratidwani : మెట్రో విస్తరణ... ప్రజా రవాణ అవసరాలు - etv pratidwani discussion
🎬 Watch Now: Feature Video
Pratidwani : హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎంజీబీఎస్, ఫలక్నుమా మెట్రో పనులను కూడా చేపట్టాలని కేటీఆర్ ఆదేశించడంతో.. అధికారులు దీనిపై కూడా దృష్టిసారించారు. 10 కిలోమీటర్ల ఈ మార్గం ఎక్కువగా పాతబస్తీ మీదుగానే వెళ్తుంది. అక్కడ చాలా వరకు ప్రార్థనా మందిరాలు ఉండటం, వాటిని మార్చే వీలులేకపోవడం, అలైన్ మెంట్ మార్చిచే ఖర్చు పెరుగుతుందని ఎల్ అండ్ టీ ఈ మార్గంలో పనులు ఆపేసింది. ఇప్పుడు కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను పూర్తి చేసేందుకు ఉత్సాహం చూపడం కాస్త ఊరటనిచ్చే అంశం. మరోవైపు విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో ప్రజారవాణా చాలా కీలకంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రైవేట్ వాహనాలతో భాగ్యనగరం రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగుపడితేనే ప్రజల రవాణాకు ఇబ్బందులు తొలగుతాయి. అందుకే ఇందులో ఉన్న అడ్డంకులేంటి.. మెట్రోతోనే మన సమస్యలు తీరుతాయా.. ఎంఎంటీఎస్, ఆర్టీసీ పరిస్థితి ఏంటి.. ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వనిపై చర్చిద్దాం..