Pratidwani : రాజ్‌భవన్ - ప్రగతిభవన్... ఈ దూరం ఇంకెంతకాలం?
🎬 Watch Now: Feature Video
Pratidwani : రాజ్‌భవన్ - ప్రగతిభవన్... ఈ దూరం ఇంకెంతకాలం? పరిస్థితి సద్దుమణిగింది అనుకున్నంత సేపు పట్టలేదు... కథ మళ్లీ మొదటికి రావడానికి. ఆ మధ్య గణతంత్ర దినోత్సవం, ఎట్ హోం వంటి కీలక సందర్భాల్లోనూ గవర్నర్ - ముఖ్యమంత్రిమధ్య దూరం, ఎడమొహం పెడమొహంపైనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇరు వైపుల నుంచి మాటల తూటాలు కూడా పేలాయి. ఆ అంకం ఏదో ముగిసింది అనుకుంటున్న తరుణంలో గవర్నర్ కోటా MLC అభ్యర్థిత్వాల తిరస్కరణతో మళ్లీ మొత్తం మొదటికి వచ్చినట్లైంది. గవర్నర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. గవర్నర్ ఓ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీ గవర్నర్‌కు మద్దతుగా నిలిచింది. తమిళిసైకి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని చెబుతోంది. ఈ పరిణామాలు దేనికి సంకేతం? రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి కార్యాలయాల మధ్య అసలు ఏం జరుగుతోంది? తిరిగి సామరస్య పూర్వక వాతావరణం వెలిసే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.