Pratidwani: పంటరుణాలు... రైతుల అవస్థలు - ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-17703963-120-17703963-1675873310917.jpg)
Pratidwani: రాష్ట్రంలో రైతులకు బ్యాంకుల ద్వారా అందుతున్న పరపతిసాయం ఎంత? ఏటా భారీస్థాయిలో నిర్థేశించుకుంటున్న వ్యవసాయ వార్షికరుణాల లక్ష్యాలను ఎంతమేర చేరుకుంటున్నారు? కొంతకాలంగా అన్నదాతలు, వ్యవసాయ ఆర్థికవేత్తలను తొలచివేస్తున్న ప్రశ్న ఇది. గత ఆర్ధిక సంవత్సరాన్నే తీసుకుంటే.. మార్చి నాటికి బ్యాంకులు ఇవ్వాల్సిన పంటరుణాల్లో 72%మే లక్ష్యం చేరాయి. అదీగాక.. బ్యాంకులు ఇచ్చామని చెబుతున్న వాటిలోనూ పాతరుణాలకు వడ్డీలు చెల్లించి రైతులు పునరుద్ధరించుకున్నవే అధికం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. ఆ ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రైతులకు పంటరుణాల పంపిణీ ఎలా ఉంది... చేపట్టాల్సిన చర్యలపైనే నేటి ప్రతిధ్వని.