ప్రజలకు న్యాయం ఎందుకంత భారంగా మారుతోంది చేపట్టాల్సిన చర్యలేంటి - etv Bharath
🎬 Watch Now: Feature Video
Prathidhwani నిందితుడు అన్నంత మాత్రాన అతడు నేరం చేసినట్లు కాదు. అరెస్టు చేసినంత మాత్రాన ఒకరు జైలు జీవితాల్లోనే మగ్గిపోవాల్సిన పని లేదు. జరిగిన నేరం అతడే చేశాడని నిరూపణయ్యే వరకు ఎవరైనా నిర్దోషి కిందే లెక్క. అత్యంత కీలకమైన నేర న్యాయ వ్యవస్థలో ఈ చిన్న మర్మం ప్రజలకు విడమరిచి చెప్పేది ఎవరు. కనీసం బెయిలుకు నోచుకోక విచారణ ఖైదీలుగా జీవితాలు ముగిస్తున్న అనేక మంది అభాగ్యులకు అండగా నిలిచి వారి హక్కులను వారికి తిరిగి అందించేది ఎవరు. ఈ బృహత్తర బాధ్యతను నెరవేర్చాల్సిందీ అదే న్యాయవ్యవస్థ. పేదలకు, పరిమిత వనరులు కలిగిన వ్యక్తులకు ఉచితంగా న్యాయసేవలు అందించడం ఆధునిక సంక్షేమ రాజ్య ప్రాథమిక కర్తవ్యం. మరి ఆ స్ఫూర్తి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతోంది. న్యాయం కోసం పేదలు, బీదల భారమైన నిరీక్షణలు ఏం చెబుతున్నాయి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST