ఆస్కార్ విజయం... ఏ భవిష్యత్తుకు సంకేతం..? - first Telugu film to win an Oscar
🎬 Watch Now: Feature Video
Pratidwani on Oscar Award for Natu Natu Song: ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ ఆస్కార్ ’ అవార్డును సాకారం చేసింది.. ‘ఆర్‌ఆర్‌ఆర్"చిత్రం. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమపాటగా అవార్డు సొంతం చేసుకుంది. తెలుగు సినిమా పాట ప్రపంచ యవనికపై సగర్వంగా తల ఎత్తుకు నిలబడింది. అసలు ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి ఈ ఘనత ఎలా సాధ్యమైంది? అచ్చతెలుగు పదాలతో రాసిన పాటకు ఆస్కార్ న్యాయనిర్ణేతలు ఏ ప్రాతిపదికన ఓటేసి ఉంటారు? నాటునాటుకి ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమాను ఏ దిశగా తీసుకుపోనుంది? ఈ ఆరంభం ఏ భవిష్యత్తుకు సంకేతం? బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ రూ.1000కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ లాంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కరిపించి జక్కన్న దర్శకత్వ ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. తెలుగు సినిమాకు దక్కిన ఈ గౌరవంపై ఇవాళ్టి ప్రతిధ్వని...