Prathidwani : కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు.. అన్యాయంగా చిదిమేస్తున్న ఘటనలు ఇంకెంతకాలం? - తెలంగాణలో భ్రూణ హత్యలు తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Prathidwani Debate on Gender Determination Tests : కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు.. అన్యాయంగా చిదిమేస్తున్నారు కొందరు దుర్మార్గులు. లింగనిర్థారణ పరీక్షలు చేయడం క్షమించరాని నేరమైనా ఆ మాటే వారికి పట్టడం లేదు. ఫలితంగా ఆడపిండాల హత్యలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. రాష్ట్రంలో ఆరోగ్యశాఖ నుంచి దిద్దుబాటుకు చర్యలు తీసుకుంటున్నా.. అడ్డుతగులుతున్న రాజకీయజోక్యం సమస్యను తీవ్రతరం చేస్తోంది. హైదరాబాద్ మహానగరం సహా... జిల్లాలు, మండల కేంద్రాల్లో సైతం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లలో అడ్డగోలుగా లింగనిర్థారణ పరీక్షలు చేస్తున్నారన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. తెలంగాణలో ప్రతి 1000 మంది మగ శిశువులకు.. 927 మంది మాత్రమే ఆడ శిశువులున్నారు. 2017లో ఆ సంఖ్య 932గా ఉండేది. ఆరు సంవత్సరాలలో వారి సంఖ్య పెరగాల్సింది పోయి.. తగ్గుతుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో బాలబాలిక నిష్పత్తి అంచనాలకు కూడా గొడ్డలిపెట్టుగా మారుతున్న ఈ విషయంలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.