Prathidhwani: భారత స్టార్టప్‌ల్లో లేఆఫ్‌ల అలజడి... - about today Prathidhwani
🎬 Watch Now: Feature Video
Prathidhwani: ప్రపంచ స్టార్టప్ సక్సెస్ సాగాకు భారత్‌ను రాజధానిగా చెప్పేవారు. ఇప్పటికీ యూనికార్న్ రేస్‌లో ఇండియన్ స్టార్టప్‌లే అధికం. రెండు నెలల క్రితం... 2022కి గాను వెల్లడైన గణాంకాల్లో భారతీయ అంకుర సంస్థల అనితర సాధ్యమైన విజయాలు చూసి ప్రపంచమే ఆశ్చర్య పోయింది. 350 బిలియన్ డాలర్ల విలువతో... 115 యూనికార్న్ కంపెనీలతో ఇండియన్ స్టార్టప్ సెక్టార్ సగౌరవంగా కాలర్ ఎగురవేసింది. కానీ ఇదే కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, వెలుగు చూస్తున్న గణాంకాలు కలవర పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికే మన స్టార్టప్‌లలో ప్రకటించిన లేఆఫ్‌లు అక్షరాల.. 9 వేల 400. గతేడాది ప్రారంభం నుంచి చూస్తే అది 25 వేలకు పైనే. పోనుపోను అదింకా పెరగొవచ్చంటున్నారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఫండింగ్ లెక్కలూ భారీగా తగ్గడం దేనికి సంకేతం? అమెరికా సిలికాన్‌వ్యాలీ బ్యాంక్ పతనం భారతీయ స్టార్టప్‌లపై ఎలాంటి ప్రభావం చూపించింది? తదితర అంశాలపై నేటి మన ప్రతిధ్వని.