వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అనుమానమే లేదంటున్న లక్ష్మణ్ - కె లక్ష్మణ్
🎬 Watch Now: Feature Video
BJP MP Laxman F2F: రాష్ట్రంలో తామంటే తాము అధికారంలోకి వస్తామని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఖండించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారన్నారు. కాషాయపార్టీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు ఉన్నారని.. ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మానసికంగా బీఆర్ఎస్ను ఓడించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. బంగారు తెలంగాణ బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. మిషన్ 90 లక్ష్యంతో బీజేపీ ముందుకు పోతుందంటే అది తమ పార్టీలో ఉన్న ఆత్మవిశ్వాసం అని అభివర్ణించారు. తెలంగాణలో అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఎన్ని ఏకమైనా కమలం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గుజరాత్ ఎన్నికలప్పుడు కూడా అన్నిపార్టీలు హేళన చేశాయి. 25 సంవత్సరాలు పాలించారు.. మరి రారు అనీ. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. వాళ్లు ఎటువైపుకు నిలబడాలో తెలుసునని లక్ష్మణ్ అన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటున్నాయని ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తామని.. తమ పార్టీలో ఎటువంటి గ్రూపు రాజకీయాలు లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు తమతో ఉన్నప్పుడు కమలదళాన్ని ఎదుర్కొవడం అసాధ్యమని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. తాను ముందునుంచి చెబుతున్నానంటున్న కె.లక్ష్మణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...