Ramesh Pokhriyal: తెలంగాణలో అధికారం భాజపాదే: రమేశ్ పొఖ్రియాల్ - ఈటీవీ భారత్‌ను సందర్శించిన భాజపా ఎంపీ రమేశ్ పొఖ్రియాల్
🎬 Watch Now: Feature Video
Ramesh Pokhriyal: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భాజపాదే అధికారమని భాజపా ఎంపీ రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ అన్నారు. హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా భాజపా భవిష్యత్ వ్యూహాలు, రాజకీయ, ఆర్థిక ప్రతిపాదనలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో తెలంగాణపై భాజపా వ్యూహం, ఉపాధి ప్రశ్న, అగ్నిపథ్ పథకం, నూతన విద్యా విధానంపై తలెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ దేశ నూతన విద్యా విధానాన్ని ప్రపంచం మొత్తానికి గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు.సమావేశాలు ముగియడంతో ఆసియాలోనే అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో వార్తలు అందిస్తున్న ఈటీవీ భారత్ కార్యాలయాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్ ప్రతినిధితో రమేష్ పోఖ్రియాల్ ముఖాముఖి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST