ప్రధాని హైదరాబాద్ పర్యటన.. బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండనుంది?
🎬 Watch Now: Feature Video
Prathidwani: కొత్త ఏడాదిలో తొలిసారి రాష్ట్రానికి రానున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. హైదరాబాద్లో ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఆయన రాకకు బీజేపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికి రాష్ట్రంలో అధికారపక్షం అయిన బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండనుంది? అందుకు అటువైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావొచ్చు. అసలే కొంతకాలంగా ఉప్పునిప్పుగా ఉన్న పరిణామాలు, గత పర్యటన అనుభవాల దృష్ట్యా నెలకొన్న ఉత్కంఠ ఇది. సింగరేణి ప్రైవేటీకరణ కేంద్రం కుట్రలు అని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే మహాధర్నాలకూ ఆ పార్టీ పిలుపునిచ్చింది. అసలు ఈ వివాదం మళ్లీ రాజుకోవడానికి కారణం ఏమిటి?.. కేంద్రం - రాష్ట్రం మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? మరోవైపు సీఎంకు ఆహ్వానం పంపినట్లు బీజేపీ చెబుతోంది. మరి ప్రొటోకాల్ కోసమైనా ముఖ్యమంత్రి హాజరవుతారా? విమర్శలు, వివాదాలపై ప్రధాని స్పందించే అవకాశం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.