Etela Rajendar Fires on CM KCR : 'రాష్ట్ర సమస్యలను వదిలేసి.. దేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రచారం' - హైదరాబాద్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2023/640-480-18882307-794-18882307-1688125473236.jpg)
Etela Rajendar Latest News : మూసీ నదీ జలాలు విషపూరితంగా మారుతున్నాయని.. ఫలితంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మూసీ నదిలోని నీరు కలుషితమవుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు. నదీ జలాలు కాపాడుకోవాలని, భూగర్భ జలాలను పెంచుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మూసీ నదీ జలాలు కాలుష్యం అవుతున్నాయని.. దీనిద్వారా పరిసర ప్రాంతాల్లో పండే పంట విషతుల్యం అవుతోందని ఆరోపించారు. సదరు ప్రాంతాల్లో బోర్లు వేస్తే పచ్చని నీళ్లు వస్తాయని అన్నారు. అవి ఎవ్వరికీ లాభం చేకూరవని పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన చేస్తామని కమిటీ వేశారని.. అయినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని విమర్శించారు. ఈ నది వల్ల హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లోని జలాశయాలను శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సమస్యలను పరిష్కారం చేయకుండా.. దేశాన్ని అభివృద్ధి చేస్తానని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.