Etela Rajendar Interview : 'బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయనే దుష్ప్రచారం మానుకోవాలి' - Etala Rajender Interview
🎬 Watch Now: Feature Video
Narendra Modi Warangal Tour arrangements : 30 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ గడ్డపై అడుగుపెడుతున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ అన్నారు. ఆయన నోట వచ్చే ప్రసంగం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో నేపథ్యంలో సభ ఏర్పాట్లను కార్యకర్తలతో కలిసి ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై విషం కక్కే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తెలంగాణ గడ్డపై బీజేపీ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందని గుర్తు చేశారు. అలాగే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ సత్తాచాటిందని గుర్తు చేశారు. మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందని అభిప్రాయపడ్డారు. చాపకింద నీరులా కమలం పార్టీ తెలంగాణలో విస్తరిస్తోందని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు. ప్రధాని సభకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.