ఖమ్మంలో ఒక్కసారిగా కుప్పకూలిన గ్రంథాలయం - తప్పిన పెను ప్రమాదం - Minister Tummala visits Library
🎬 Watch Now: Feature Video
Published : Jan 12, 2024, 7:44 PM IST
Central Library Collapsed in Khammam : ఖమ్మంలో డిపో రోడ్డు వద్ద ఉన్న కేంద్ర గ్రంథాలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇవాళ గ్రంథాలయానికి సెలవు కావడంతో పాఠకులు ఎవరూ రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 1957లో నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతోనే కూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో పక్క భవనంలో చదువుకుంటున్న విద్యార్థులు శబ్దానికి భయపడి పరుగులు తీశారు.
Minister Tummala Nageshwarao Visits Collapsed Library : ఈ క్రమంలో పరిసర ప్రాంత వాసులు కూడా భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల విద్యార్థులతో మాట్లాడి, గ్రంథాలయాన్ని మరో చోటుకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు ఈ గ్రంథాలయానికి 200 నుంచి 300 వరకు పాఠకులు వస్తుంటారని అధికారులు తెలిపారు. వెంటనే అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కుప్పకూలిన భవన శిథిలాలను తొలిగించారు.