స్కూల్​ బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్​ పరార్.. వణికిన జనం​! - ఏనుగు వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2022, 10:22 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

అడవి నుంచి తప్పిపోయి నివాస ప్రాంతాల్లోకి వచ్చిన ఓ గజరాజు హల్​చల్​ సృష్టించింది. జాతీయ రహదారిపై ఓ పాఠశాల బస్సును అడ్డగించి దాడి చేసింది. బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటన తమిళనాడు, నీలగిరి జిల్లాలోని ముల్లూర్​ ప్రాంతంలో జరిగింది. ఏనుగు దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఏనుగును గమనించిన డ్రైవర్​.. బస్సును వదిలి పరుగులు పెట్టాడు. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఏనుగును అడవిలోకి పంపే ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ రోడ్డున వెళ్లే ప్రయాణికులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.