బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు.. లక్కీగా..! - Electric vehicle fire in Asifnagar
🎬 Watch Now: Feature Video
Electric vehicle fire in Asifnagar: రోడ్డుపై వెళ్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైన ఘటన హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వాహన దారుడు చెప్పిన కథనం ప్రకారం.. గుడి మల్కాపూర్ నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా.. ఎల్ఐసీ కార్యాలయం వద్దకు రాగానే ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వాహనదారుడు వెంటనే బండిపై నుంచి దిగి దూరంగా పరుగులు తీశాడు. చూస్తుండగానే ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. ఎలక్ట్రిక్ బైక్‌లో సాంకేతిక లోపం వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని సదరు వాహనదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో మిగతా వాహన చోదకులు భయందోళనకు లోనయ్యారు. బైక్ దగ్దం కావడంతో అటు నుంచి ఇతర వాహనాలు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఎలక్టిక్ వాహనాల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో వాహన చోదకులు ఆందోళనకు గురవుతున్నారు.