Electric Scooter Fire in Jagtial : స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు.. కొద్దిలో మిస్సయ్యాడు.. - తెలంగాణ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 3:06 PM IST

Electric Scooter Fire in Jagtial : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల శివారులోని రైతు వేదిక వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్​ దగ్ధమైంది. ఒక వ్యక్తి విద్యుత్‌ వాహనంపై వెళ్తుండగా.. అకస్మాత్తుగా వాహనం నుంచి పొగలు వ్యాపించాయి. దీంతో ఏమీ అర్థం కాని వాహనదారుడు అయోమయంలో పడ్డాడు. పొగలు ఎక్కువవడంతో అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని అక్కడే నిలిపి పక్కకు వెళ్లాడు. కొద్దిసేపట్లోనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

E Scooret Fire News 2023 : నడిరోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనను చూసిన వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. బుగ్గారం శివారు ప్రాంతమైన ఆ దారిలో ఎక్కువ జన సందోహం లేకపోవడం వల్ల ఎవరికీ ఏ హానీ జరగలేదు. బండి నడిపిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెట్రోల్​ ధరలు ఎక్కువవుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లతో తమకు డబ్బులు ఆదా అవుతాయని వాహనదారులు అనుకుంటే.. వారికి కొత్త కష్టాలు వచ్చినట్లైంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.