Drunken Post Master Nirmal District : మద్యం మత్తులో విధులకు పోస్టుమాస్టర్.. ఆవేదనలో ఖాతాదారులు - Drunken Post Master Nirmal District
🎬 Watch Now: Feature Video

Drunken Post Master Nirmal District : 18వ శతాబ్దం నుంచి ప్రజలకు అతి చేరువలో ఉంటూ.. సేవలందించటంలో పోస్ట్ ఆఫీస్‌కు పెట్టింది పేరు. అటువంటి తపాల సేవలకు కలంకం తెచ్చిపెట్టేలా ఓ పోస్ట్‌మాస్టర్ చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో సబ్‌పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తున్న షెజ్ చాంద్ మద్యం సేవించి వచ్చారు. రోజూ తాగి రావటంతో పాటు.. ఉదయం విధులకు హాజరు కావల్సి ఉండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలస్యంగా వస్తున్నాడని స్థానికులు అంటున్నారు. సరైన సేవలు అందించట్లేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.
Viral Video of Drunken Post Master Nirmal : ఈ విషయంపై అతన్ని ప్రశ్నించగా మద్యం మత్తులో పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై స్థానికులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు కార్యాలయానికి చేరుకొని సబ్పోస్ట్మాస్టర్కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. నిర్ధారణలో ఆల్కహాల్ తాగినట్లు గుర్తించి.. వైద్య పరీక్షల నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు. కూలి పనులు చేసుకునే తమకు సేవలందించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవటం ద్వారా ఇబ్బందులు పడుతున్నామని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.