నేను బీజేపీ నాయకుడిని, నాపైనే చేయి వేస్తావా - మద్యం మత్తులో వ్యక్తి హల్​చల్ - Druken men viral video

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 5:18 PM IST

Drunken Men argues with Traffic Police : విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తుండగా బీజేపీ పార్టీ నాయకుడినంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్​లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మాల్కాపూర్​కు చెందిన నాగరాజు, నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరిని గమనించి వారి వాహనాన్ని ఆపారు.

వీరికి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్ట్​ నిర్వహించగా, మందు బాబులు ట్రాఫిక్​ పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో మద్యం మత్తులో తాను బీజేపీ నాయకుడిని అంటూ ట్రాఫిక్​ ఎస్సై ఉదయ్ ​కిరణ్​ను నెట్టివేశాడు. అంతేకాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగి దురసుగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే ట్రాఫిక్​ పోలీసులు స్థానిక ఎన్టీపీసీ ఠాణాకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మందు బాబులను అదుపులోకి తీసుకొని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ట్రాఫిక్​ ఎస్సై ఉదయ్​కిరణ్​ ఫిర్యాదు మేరకు మందు బాబులపై కేసు నమోదు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.