Cigarette Fight Video Viral : సిగరెట్ తేలేదని బార్‌పై మందుబాబుల దాడి.. వీడియో వైరల్ - సిగరెట్ ఫైట్
🎬 Watch Now: Feature Video
Drinkers Attacked Bar For Cigarettes : సిగరెట్ తేలేదని వెయిటర్‌పై మందుబాబులు దాడికి దిగిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడి మల్కాపూర్‌లో సోమవారం జరిగింది. ఈ దాడిలో బార్ యజమానికి కంటికి తీవ్రగాయమై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు మందు బాబులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్‌లో సోమవారం రాత్రి కొందరు మందుబాబులు కనకదుర్గ బార్‌లో మందు తాగేందుకు వచ్చారు. మందు తాగుతూ మధ్యలో అక్కడ ఉన్న వెయిటర్‌ను సిగరెట్ తెమ్మని అడిగారు. దానికి ఆ వెయిటర్ నిరాకరించడంతో మందుబాబులకు బార్ సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బార్ యజమాని కంటికి తీవ్రగాయమైంది. గాయం కావడంతో అతనికి ఓ ఆస్పత్రిలో సర్జరీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు మందుబాబులను అరెస్టు చేశారు. ఆ మందుబాబులు కర్రలతో దాడి చేసిన బార్ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి.. అరెస్టు చేయాలని వాపోయారు. ఈ దాడి విజువల్స్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.