DK Aruna Submits Judgement Copy : నన్ను MLAగా గుర్తించండి : డీకే అరుణ - న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడానికి అసెంబ్లీకి అరుణ
🎬 Watch Now: Feature Video
Published : Sep 1, 2023, 1:24 PM IST
|Updated : Sep 1, 2023, 7:33 PM IST
DK Aruna Submits Judgement Copy to Vikas Raj : తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌ను బీఆర్‌కే భవన్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. ఆమెను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ.. ఇటీవల కోర్టు తీర్పు నిచ్చింది. డీకే అరుణతోపాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, పార్టీ నేతలు వికాస్‌రాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పత్రాన్ని వికాస్‌రాజ్‌కి అందజేశారు. హైకోర్టు(High Court) ఇచ్చిన తీర్పుతో పాటు తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆమె కోరారు. త్వరలోనే సంబంధిత అధికారులు పరిశీలించి సమాచారం ఇస్తామని చెప్పినట్లు డీకే అరుణ తెలిపారు. కోర్టు తీర్పును అమలు చేస్తారని నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
DK Aruna Fires on Telangana Speaker : హైకోర్టు తీర్పు అనంతరం శాసనసభ స్పీకర్, కార్యదర్శిని కలిసి కోర్టు ఉత్తర్వులు అందజేసేందుకు ఆ పార్టీ ప్రతినిధి బృందంతో ఆమె అసెంబ్లీకి వెళ్లారు. ఆమెతో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బండ కార్తీక తదితరులు ఉన్నారు. గురువారం, ఇవాళ ఫోన్ చేసి, సంక్షిప్త సమాచారం ఇచ్చినా అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి అందుబాటులో లేరని డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యాలయంలో తీర్పు కాపీని అందించినట్లు తెలిపారు.