Maruthi Daughter Art Gallery : 8 నెలల్లో 71 కామిక్ చిత్రాలు.. చూస్తే వావ్ అనాల్సిందే! - director maruthi daughter gallery
🎬 Watch Now: Feature Video

Maruthi Daughter Art Gallery in Hyderabad : నేటితరం పిల్లల ఆలోచనలు సృజనాత్మకత.. దాంతో పాటు అందులో లోతైన అర్థం ఉంటుందని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి గీసిన చిత్రాల ప్రదర్శనను.. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ విచ్చేసి చిత్రాలను వీక్షించి హియాను అభినందించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హియా దాసరి కామిక్, స్టోరీస్‌లోని జోకర్, బ్యాట్‌మెన్, తదితర క్యారెక్టర్లను ఇతివృత్తంగా చేసుకొని బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో 'ది నోయిర్ రెండిజ్‌వోజ్' పేరుతో ఆర్ట్‌షో ఏర్పాటు చేశారు. 71 చిత్రాలు గీసానని ఈ చిత్రాలన్నీ వేయడానికి 8 నెలల సమయం పట్టిందని హియా చెప్పింది. తన ప్రతిభ వెనకాల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని తెలిపింది. భవిష్యత్‌లో మరిన్ని అంశాలపై చిత్రాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్, హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, విరాజ్, నిర్మాత ఎస్‌కేఎన్, తదితరులు పాల్గొన్నారు.