Dharna on SI rude behaviour : సీటు విషయంలో గొడవ... చివరికి ధర్నాకు దారితీసింది.. - ఎస్సై ప్రవర్తనపై ధర్నా
🎬 Watch Now: Feature Video
Dharna on SI rude behaviour : ఆర్టీసీ బస్సు ఆపి ఓ మహిళా ప్రయాణికురాలిపై జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ దాడి చేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో యువకులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘర్షణ కొనసాగింది. ఒక దశలో యువకులు జగిత్యాల పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తడం వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ సమయంలో పరిస్థితులు చేజారిపోయాయి. పోలీసులు సమన్వయం పాటిస్తూ యువకులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
మహిళపై చేయిచేసుకున్న ఎస్సై: కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సులో జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ భార్యకు, మహిళా ప్రయాణికురాలి మధ్య బస్సు సీటు విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో జగిత్యాలకు రాగానే బస్సు ఆపిన ఎస్సై మహిళా ప్రయాణికురాలిపై చేయిచేసుకున్నాడు. ఈ గొడవ కాస్త చినికి చినికి గాలి వానల మారింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఎస్సైపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.