రక్తపు మడుగులోనే 20 నిమిషాలు- రోడ్డు ప్రమాదంలో యువ డైరెక్టర్ మృతి - delhi film maker dead
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-11-2023/640-480-19923370-thumbnail-16x9-delhi-road-accident-live-video-today.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 2, 2023, 6:11 PM IST
Delhi Road Accident Live Video Today : దేశ రాజధాని దిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ ఫిల్మ్‌మేకర్ ప్రాణాలు కోల్పోయాడు. కల్కాజీలో నివాసముంటున్న పీయూష్ పాల్ గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. అదే దారిలో వేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనం అతడి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పాల్ సమీపంలోని చెట్టును ఢీకొని గాయపడటం వల్ల తీవ్రరక్త స్రావమైంది. దాదాపు 20 నిమిషాల పాటు రక్తపు మడుగులో ఉన్న పీయూశ్ను.. ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న పీయూష్‌ను... ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం అవ్వడం వల్ల చికిత్స పొందుతూ పాల్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కొంత సమయం ముందు తీసుకువస్తే బతికే అవకాశం ఉండేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీని పరిశీలించి ప్రమాదానికి కారణమైన నిందితుడిని బంటీగా గుర్తించారు.