గొడవపడి ముగ్గురు వ్యక్తుల పైనుంచి కారును తీసుకెళ్లిన డ్రైవర్ - దిల్లీ కారు ప్రమాదం న్యూస్
🎬 Watch Now: Feature Video
దిల్లీలోని ఓ రోడ్డుపై జరిగిన చిన్న వివాదం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. అక్టోబర్ 26న అలీపుర్ ప్రాంతంలోని నితిన్ మాన్ అనే కారు డ్రైవర్ బైక్ పైన వెళ్లే ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. రోడ్డుపై ఈ వివాదం జరుగుతున్న క్రమంలోనే అక్కడికి వచ్చిన స్థానికులు బైక్‌పైన ఉన్న వ్యక్తికి అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన నితిన్ వారి పైనుంచి కారును తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో రోషన్, మీనా, యువరాజ్ అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదైయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST