'డెక్కన్ క్వీన్' ఎక్స్‌ప్రెస్ 94వ బర్త్‌డే.. స్టేషన్లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్.. కేక్ కట్ చేసి.. - ట్రైన్‌కు బర్త్‌డే వేడుకలు
🎬 Watch Now: Feature Video
Deccan Queen Birthday 2023 : సాధారణంగా మనుషులే పుట్టినరోజు పార్టీలు చేసుకోవడం చూస్తుంటాం. ప్రస్తుత రోజుల్లో జంతువులకు బర్త్‌డేను ఘనంగా చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం 'డెక్కన్ క్వీన్' ఎక్స్‌ప్రెస్ అనే రైలుకు అధికారులు, ప్రయాణికులు.. బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు.
ఇదీ అసలు కథ..
డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్.. దేశంలోనే మొదటి సూపర్ ఫాస్ట్ రైలు. దీనిని 1930 జూన్ 1న ఆంగ్లేయులు ప్రారంభించారు. అప్పట్లో ఈ రైలులో ప్రయాణించేందుకు భారతీయులకు అనుమతి ఉండేది కాదు. దాదాపు రైలు ప్రారంభమైన 13 ఏళ్ల తర్వాత 1943లో భారతీయులు డెక్కన్ క్వీన్‌లో ప్రయాణించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
డెక్కన్ క్వీన్ రైలు.. పుణె నుంచి ఆర్థిక రాజధాని ముంబయి వరకు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలులో దాదాపు రోజుకు 2వేల మంది ప్రయాణిస్తున్నారు. ఈ ట్రైన్ ప్రారంభించి 2023 జూన్ 1వ తేదీకి 93 సంవత్సరాలు పూర్తి చేసుకుని 94వ పడిలోకి అడుగుపెట్టింది. అందుకే అధికారులు, రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్.. ప్రయాణికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. డప్పుల మోత మధ్య కేక్ కట్ చేశారు.