టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన - ఏం చేస్తే మేలు, యువత భవిష్యత్తుపై ప్రభావం పడుతుందా? - CM Revanth On TSPSC
🎬 Watch Now: Feature Video
Published : Jan 4, 2024, 9:41 PM IST
Debate on TSPSC Reform : పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా టీఎస్‌పీఎస్సీ ఇటీవల వరస వివాదాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ప్రక్షాళనకు సిద్ధమైంది. సమూల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది. మరి విద్యార్థులు, నిరుద్యోగుల్లో నమ్మకం కలగాలంటే ఆ మార్పులు ఎలా ఉండాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావద్దంటే ఏం చేయాలి. వివాదరహితంగా పరీక్షలు నిర్వహిస్తున్న యూపీఎస్సీ నుంచి ఏం నేర్చుకోవచ్చు.
ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్ 15 మధ్య నోటిఫికేషన్ల నుంచి నియామక ప్రక్రియ వరకు పూర్తిచేస్తామన్న హామీ నెరవేర్చాలంటే స్వల్ప వ్యవధిలో అంత సమర్థంగా టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దడమెలా? గ్రూప్స్‌తో పాటు 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్లలో ఒక విశ్వాసం కలిగించడమెలా? మిగిలిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పోల్చితే కేరళలో భిన్నమైన విధానం ఉందని, అందుకే తెలంగాణ అధికారులు అక్కడి విధానాన్ని పరిశీలించినట్లు చెబుతున్నారు. ఏంటా ప్రత్యేకత? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని.