ప్రజల వద్దకు పాలన - ఐదు గ్యారంటీలు హామీ తీర్చినట్టేనా? - six guarantees Form

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 11:10 PM IST

Debate on Prajapalana in Telangana : ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ ప్రజాపాలన అనే కార్యక్రమం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి నుంచి మొదలు గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించే విధానానికి శ్రీకారం చుట్టింది. మరి కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలేంటి? ఆశిస్తున్న ప్రయోజనాలేంటి? ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా ఆ ప్రయత్నం ఎలా ఉపయోగపడే అవకాశాలున్నాయి?

ప్రజాపాలన పేరుతో జనవరి 6 వరకు ప్రభుత్వ ప్రజల్లోకి వెళ్లే సరికొత్త కార్యక్రమం చేపట్టింది. దీని లక్ష్యాలు ఏంటి? ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా  దీనిని రూపొందించారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి భరోసా లభిస్తుంది? ఇలాంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే ఏం చేస్తే మంచిది ఎలాంటి స్టేప్స్​ తీసుకోవాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.