ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం - భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు
🎬 Watch Now: Feature Video
Published : Dec 5, 2023, 9:31 PM IST
|Updated : Dec 5, 2023, 10:53 PM IST
DCM Van Rammed into a House in Jagtial : సహజంగా యాక్సిడెంట్ రోడ్లపై జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో కొత్తగా ఏముంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఏకంగా ఓ డీసీఎం వ్యాన్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో జరిగింది. మెట్పల్లి మండలంలోని తండా నుంచి కోరుట్ల వైపు ధాన్యం లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్, మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి సమీపంలో ఉన్న ఇంట్లోకి వేగంతో దూసుకు పోయింది.
దీంతో ఒక్కసారిగా ఇంటి సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల ఇంటి గోడ కూలి ఇంట్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఇంటి మీదికి దూసుకొచ్చిన లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఆ లారీలో ఉన్న ధాన్యం బస్తాలన్నీ మరో లారీలోకి తరలించారు. అనంతరం లారీని బయటికి తీశారు.