రూ.500లకు గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పనిసరి కేవైసీ అంటూ పుకార్లు - క్యూ కట్టిన వినియోగదారులు - నిజామాబాద్‌లో గ్యాస్ కేవైసీ లెటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 10:25 PM IST
|Updated : Dec 8, 2023, 6:38 AM IST
Crowds Lined Up At Gas Agencies In Nizamabad : తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలో ఒకటైనా రూ.500లకే గ్యాస్ సిలిండర్ కోసం కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వస్తున్న అసత్య ప్రచారానికి గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల వద్ద వృద్దులు, మహిళలు పిల్ల పాపలతో ఉదయం 7 గంటల నుంచే కేవైసీ కోసం వచ్చి క్యూ లైన్లో పడిగాపులు కాశారు. అయితే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చిందని అందుకోసమే లైన్లో నిలబడ్డామని గ్యాస్ వినియోగదారులు తెలుపుతున్నారు.
Queue Line Of Gas Consumers In Nizamabad : ప్రభుత్వం రూ.500లకే సబ్సిడీ కోసమా, లేక కేవైసీ కోసమా తమకు తెలియడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మూడు గంటలుగా క్యూలో నిలబడ్డామని వారు చెబుతున్నారు. రమేశ్ హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి కస్టమర్ ఈ- కేవైసీ చేసుకోవాలని తెలిపారు. గత నెల 20 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రూ.500 సిలిండర్‌కు కేవైసీకి ఎలాంటి సంబంధం లేదని కేవైసీ అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.