CPI Narayana Fires on CM KCR : 'కేసీఆర్ కుటుంబం.. ఒకప్పుడు బీజేపీపై ఆరోపణలు చేసింది.. ఇప్పుడేమో వత్తాసు పలుకుతోంది'
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 4:12 PM IST
CPI Narayana Fires on CM KCR : సీఎం కేసీఆర్ కుటుంబంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఒకప్పుడు బీజేపీపై ఆరోపణలు చేసిందని.. ఇప్పుడేమో ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేస్తారనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంపై ఐటీ, ఈడీ దాడులు చేస్తే.. కోట్లాది రూపాయలు బయటపడతాయని అన్నారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వారిపై దాడులు చెయ్యరని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీకి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకే దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయన్నారు.
CPI Narayana Latest Comments on CM KCR Family : ఎంఐఎం మీద పోటీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ తీర్థం తీసుకున్నారన్నారు. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతుందని నారాయణ ధ్వజమెత్తారు. ఇండియా కూటమి సమావేశం జరగ్గానే వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోందని ఆక్షేపించారు. రామ్‌నాథ్ కోవిండ్ నేతృత్వంలో వేసిన కమిటీని తాము బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ కమిటీని అందరం కలిసికట్టుగా నిర్వీర్యం చేయాలని ఇతర పార్టీలను కోరారు.