'పోలింగ్‌కు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ ఎలా అనుమతిస్తుంది?'
🎬 Watch Now: Feature Video
CPI Leader Chada Intresting Comments on BRS, BJP : తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కొట్లాడింది ఏమీలేదని.. సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అణబెరి, సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీఆర్ఎస్ను గెలిపించేలా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు రైతు బంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అర్థమవుతోందన్నారు.
బీఆర్ఎస్ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశం ఇద్దామని ప్రజలు అనుకుంటున్నరన్నారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. బీఆర్ఎస్ను ఓడించడమంటే బీజేపీను ఓడించడమేనన్నారు. రాష్ట్రంలో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ అగ్ర నేతలు, మంత్రులంతా రాష్ట్రానికి వరుస కడుతున్నారని ఎద్దేవా చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకోవాలని.. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.