గోమూత్రం, పేడతో ప్రత్యేక తివాచీ- ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్! - ఆవు పేడతో తివాచీ తయారీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-12-2023/640-480-20370689-thumbnail-16x9-cow-dung-mat-made-for-modi.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Dec 27, 2023, 10:10 PM IST
Cow Dung Mat Made For Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చేందుకు ఆవు పేడ, గోమూత్రంతో ఓ ప్రత్యేక తివాచీ రూపొందించారు ఛత్తీస్‌గఢ్ ఖైరాగఢ్లోని మనోహర్ గోశాల నిర్వాహకులు. ఆయుర్వేద హితామహుల్లో ఒకరైన చరకుడి ప్రేరణతోనే దీనిని తయారు చేసినట్లు తెలిపారు.
"ఈ తివాచీని ఆవు పేడతో తయారు చేశాము. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఆయుర్వేద పితామహుడు చరకుడు ఈ తివాచీని వాడారు. ఆయన ప్రేరణతోనే తివాచీని సిద్ధం చేశాము. ఇదే కాకుండా ఆయన నుంచి మనం ప్రేరణ పొందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి."
--పాదం డాక్లియా, మనోహర్ గోశాల మేనేజింగ్ ట్రస్టీ
ఈ తివారీ బరువు 14 కిలోలకుపైనే. దీనిని తయారు చేయడానికి సౌమ్య కామధేను జాతికి చెందిన ఆవు పేడ, మూత్రాన్ని వినియోగించారు.
"ఈ తివాచీని పూర్తిగా సౌమ్యకామధేను అనే జాతికి చెందిన ఆవుమూత్రం, పేడతో తయారు చేశాము. ఈ రకం ఆవులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ ఆవు జాతి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించింది."
--పాదం డాక్లియా, మనోహర్ గోశాల మేనేజింగ్ ట్రస్టీ
మోదీ కోసం తయారు చేసిన ఈ తివాచీని త్వరలోనే దిల్లీలోని ఆయన నివాసానికి పంపించనున్నారు.