Couple Selfie Suicide : భూ తగాదాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్ - husband and wife suicide in nagar kurnool
🎬 Watch Now: Feature Video
Couple Selfie Suicide in Nagar Kurnool : పూర్వీకుల నుంచి తమకు వచ్చిన 15 ఎకరాల్లో ఏళ్ల తరబడి సాగు చేస్తున్నామని.. కానీ ఆ పొలంపై తమకు హక్కులు రాకుండా కొంత మంది బంధువులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుని.. తమ గోడును ఆ వీడియోలో వెల్లబోసుకుంది. వారిని ఆత్మహత్యాయత్నం చేసేలా ప్రేరేపించిన వారి పేర్లను వీడియోలో ప్రస్తావిస్తూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని సురాపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి, అతని భార్య శివలీల ఈనెల 29వ తేదీన గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన వ్యవసాయ కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే బాధితులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో దంపతులిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
తాతల కాలం నుంచి తాము 15 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నామని దంపతులు వీడియోలో తెలిపారు. తమ 15 ఎకరాలకు సంబంధించిన రికార్డు ధరణి పోర్టల్లో రాకుండా తమ కుటుంబ సభ్యులు సమస్యలను సృష్టిస్తున్నారని వాపోయారు. భూ తగాదాల వల్ల తమ పిల్లలు కూడా దూరమయ్యారని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చావుకు ఆరుగురు వ్యక్తులే కారణమని వారి పేర్లను ప్రస్తావిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి యత్నించారు.